టేలర్ వికెట్ కోల్పోయిన జింబాబ్వే
హైదరాబాద్: ఐర్లాండ్ నిర్దేశించిన 332 పరుగుల లక్ష్యాన్ని ా’ాదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే 223 పరుగుల వద్ద టేలర్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 91 బంతుల్లో 121 పరుగులు చేసిన టేలర్… కుసాక్ బౌలింగ్‌లో కెవిన్ ఓబ్రియాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 149 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 38 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఇర్విన్ 0(2), సీన్ విలియమ్స్ 51(57) పరుగులతో క్రీజులో ఉన్నారు.