ట్యాంక్‌బండ్‌పై నేడు కుమ్రం భీమ్‌ వర్దంతి

హైదరాబాద్‌,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): గిరిజన ఐక్య వేదిక, తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం, ఆదివాసీ తోటి సేవా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24న కుమరం భీం 78వ వర్ధంతిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న కుమరం భీం విగ్రహం వద్ద సంస్మరణ సభ, సాంస్కృతిక కార్యక్రమాలను
నిర్వహిస్తున్నామని వేదిక జాతీయ అధ్యక్షుడు కె.వివేక్‌ వినాయక్‌ తెలిపారు. కుమరం భీం వర్ధంతి, జయంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని గిరిజన సంక్షేమ శాఖ, సాంస్కృతిక శాఖలు కూడా పట్టించుకోకపోవడం శోచ నీయమన్నారు. జోడేఘాట్‌లో కూడా వర్దంతి కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నామన్నారు.