ట్రంప్‌కు మరోమారు ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్,జూలై24(జనంసాక్షి): ఇరాన్‌తో యుద్ధమంటే అంతతేలిక కాదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన తరవాత మరోమారు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జావేద్ జరీఫ్ ట్విటర్ ద్వారా హెచ్చరించారు. పెద్దపులితో ఆటలు వద్దని అధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే. 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీలు వరుస ట్వీట్లతో పరస్పరం హెచ్చరికలు చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జావేద్ జరీఫ్ తాజాగా స్పందించారు.