ట్రంప్‌తో సమావేశానికి సిద్ధం..!!
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఏ సమయంలోనైనా కలుసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వెల్లడించారు. ట్రంప్‌తో సమావేశం ఎప్పుడు ఉండొచ్చు అని జర్నలిస్ట్‌లు అడగగా.. ఎప్పుడైనా సిద్ధమే.. మా తరఫున ఎలాంటి సమస్యా లేదు అని పుతిన్ స్పష్టంచేశారు. రష్యా, అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థాయికి రావాలని ట్రంప్ పబ్లిగ్గానే చెబుతున్నారు. దీనికి మేము మద్దతు పలకడం తప్ప మరో దారి లేదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో అది అంత సులువు కాదని తెలిసినా.. మా ప్రయత్నం మేం చేస్తాం అని పుతిన్ స్పష్టంచేశారు. అయితే ట్రంప్‌తో సమావేశం ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు.