ట్రంప్ ట్వీట్ తో చెమటలు

 అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్విట్టర్‌లో చేసిన ఓ వ్యాఖ్య విమానాల తయారీలో దిగ్గజానికి చెమటలు పట్టించింది. మార్కెట్‌లో ఆ కంపెనీ విలువను పెద్ద కుదుపు కుదిపిందిtrumptweet_1481558214828_7325417_ver1-0. ఇటీవల ఖర్చు పెరిగిపోతోందన్న కారణంతో ‘బోయింగ్ ఎయిర్‌ఫోర్స్ వన్’కు ట్రంప్ నో చెప్పారు. ఇప్పుడు ఆయన ‘ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్‌’పై గురి పెట్టారు. ఎఫ్-35 ఖర్చు అదుపు తప్పిందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది పెంటగాన్ చేపట్టిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టు. ‘ఎఫ్-35’ను లాక్‌హెడ్ మార్టిన్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ అమెరికా మిలటరీకి ప్రధాన కాంట్రాక్టర్. ట్రంప్ ట్వీట్ దరిమిలా ఆ సంస్థ మార్కెట్ విలువ మూడు బిలియన్ డాలర్లు పడిపోయింది. ‘లాక్‌హెడ్’ తర్వాత స్థానంలో బోయింగ్ రెండో స్థానంలో ఉంది. జనవరి 20 తర్వాత మిలటరీ కొనుగోళ్లలో బిలియన్ల డాలర్లను ఆదా చేయవచ్చని ఇటీవల ట్రంప్ తన ప్రమాణ స్వీకారం రోజును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ట్రంప్ వైఖరి ‘లాక్‌హెడ్’, బోయింగ్‌కు అంతు చిక్కడం లేదు.