ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి
యాదాద్రి భువనగిరి,మే11(జనం సాక్షి ): బీబీనగర్ మండలం వెంకిర్యాలలో రోడ్డుప్రమాదం జరిగింది. చెరువు కట్టపై నీళ్ల ట్యాంకర్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను పడమటి సోమారానికి చెందిన మల్లేశ్(23), శ్రీరాములు(18)గా గుర్తించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.