ట్రాన్స్ ఫర్ స్టేషన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
బల్దియా మేయర్ గుండు సుధారాణి
– సెకండ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ ను పరిశీలించిన మేయర్….
వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 07(జనం సాక్షి)
ట్రాన్స్ ఫర్ స్టేషన్ల నిర్మాణంలో వేగం పెంచాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు.
శుక్రవారం బల్దియా పరిధిలోని 11 వడివిజన్ పరిధి లోని పోతన నగర్ లో రెండవ( సెకండ్) ట్రాన్స్ఫర్ స్టేషన్ లో కొనసాగుతున్న పనుల తీరును మేయర్ గుండు సుధారాణి పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ. డా.జ్ఞానేశ్వర్, ఎమ్. హెచ్.ఓ. డా.రాజేష్, ఈ.ఈ.సంజయ్ కుమార్, సానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.