డబల్ బెడ్ రూం ఇండ్లుకు 5 లక్షలు ఇవ్వాలి.
పెరిగిన ధరలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ సాయం పెంచాలి.
అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికి
ప్రభుత్వం 3లక్షలు సాయం అందించాలి.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.
హుస్నాబాద్ రూరల్ డిసెంబర్ 10(జనంసాక్షి)పేదలకు ఉపాధి అవకాశాలు లేక, ప్రభుత్వం నుండి ఇండ్ల స్థలాలు,పక్క ఇండ్లు మంజూరు రాక పోవడం వల్ల పేద ప్రజలు బయట అద్దే ఇండ్లకు నెలనెలా కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు,హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు. శనివారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని 2 వార్డూలో ఇంటింటికీ సిపిఐ కార్యక్రమంలో భాగంగా వార్డూలల్లో తిరుగుతు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పేదలకు ఇండ్ల స్థలాలు,డబల్ బెడ్ రూం ఇండ్ల మంజూరి కోసం పేరిగిన ధరలకు అనుగుణంగా స్వంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్ల నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు మంజూరు చేయాలని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ పధకంలో
ఇండ్లు మంజూరై అసంపూర్తిగా మిగిలిపోయిన పేదల ఇండ్లకు 3 లక్షలు మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృషి చేయాలని గడిపె మల్లేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు జనగాం రాజు కుమార్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షురాలు ఏలురి స్వాతి,
సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,వార్డూలోని మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.