డబుల్ కంటే ఇదే కిక్ ఇచ్చిందన్న పుజారా
ముంబాయి: ముంబాయి లో జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముం దు అహ్మదాబాద్ లో జరగి న మొదటి టెస్టులో డబు ల్ సెంచరీ కూడా చేశాడు . ఐతే అహ్మదాబాద్ లో చేసిన డబుల్ కంటే ముం బాయిలో చేసిన సెంచరీ యే తనకు ఎక్కువ ఆనం దాన్ని ఇస్తోందని పుజారా చెబుతున్నాడు అహ్మదా బాద్ కంటే ముంబాయిలో చేసిన సెంచరీనే తనకు బెటర్‌గా అనిపిస్తుందన్నాడు. వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో బారత్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తను సెంచరీ చేశానని ,స్కోరు బోర్డును పరుగులు పెట్టించాల్సిన సమయంలో ఈ సెంచరీ తనకు సంతోషాన్ని ఇచ్చిం దని క్లిష్ట సమయంలో తను సెంచరీ చేశానని అన్నాడు. వరుసగా అవుట వ్వడంతో కనీసం 350 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచేందుకు ప్రయత్నించామన్నారు. కాగా పుజారా అహ్మదా బాద్ టెస్టులో 206 పరుగుల తో నాటౌట్ గా నిలువగా ముంబాయి టెస్టులో 135పరుగుల వద్ద ఔట య్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రమే కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటి వరకు స్టంపౌట్ కాని ఛటేశ్వర్ పుజారా తన కెరిర్ లో తొలిసారి స్టంపౌటయ్యాడు.స్వాన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి డిఫెస్స్ ఆడబోయిన పుజారా బంతిని ఆడలేకపోయాడు.