డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణంలో టాటా గ్రూపు భాగస్వామ్యం

4

– సైరన్‌ మిస్త్రీతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూమ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్‌ అంగీకరించింది. ముంబై పర్యటనలో ఉన్న  మున్సిపల్‌, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సోమవారం ఆయన ముంబైలో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో టాటా ఏఐజీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు టీ-హబ్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌కు టాటా క్యాపిటల్‌తో  సహకారం అందించనున్నారని కేటీఆర్‌ తెలిపారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ ఆసక్తిగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టాన్రికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది.  ఈ సందర్భంగా హైదరాబాద్‌ అభివృద్ధిపై ఆయనతో చర్చించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకంలో భాగస్వామ్యానికి టాటాగ్రూపు అంగీకారం తెలియజేసింది. హైదరాబాద్‌లో టాటాస్సేస్‌ ఏఐజీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. టాటా క్యాపిటల్‌ ద్వారా టీహబ్‌ ఇన్నోవేషన్‌కు ఆర్థిక సహకారం అందించేందుకు, రక్షణ, విమానయాన రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు టాటాగ్రూప్‌ ఆసక్తి చూపింది.  వీరిద్దరు పలువురు కీలక అంశాలపై చర్చించారు.

ముకేశ్‌ అంబానీతో మంచి చర్చ జరిగింది: కేటీఆర్‌

రిలయన్స్‌ సంస్థ అధినేత ముకేశ్‌ అంబానీని సోమవారం తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య మంచి చర్చ జరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రెండు పడక గదుల ఇళ్లు, విద్యుత్‌ ప్రణాళికలు మొదలైన వాటి గురించి ముకేశ్‌ అంబానీకి మంత్రి కేటీఆర్‌ వివరించారు. ముఖ్యంగా మిషన్‌ భగీరథపై సీఎం ఇచ్చిన హావిూని అంబానీకి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక అవకాశాలు ఉన్నాయని కేటీఆర్‌ ఆయనకు వివరించారు. సరైన ప్రణాళిక, కార్యాచరణతో తెలంగాణ ముందుకు సాగుతోందని, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని కేటీఆర్‌తో ముకేశ్‌ అంబానీ అన్నట్లు సమాచారం.