డబ్య్లూహెచ్‌వో వైరస్‌ కరోనా వైరస్‌ పుట్టుక సహజమైనదే..

 

జెనీవా,మే 2(జనంసాక్షి): నోవెల్‌ కరోనా వైరస్‌ పుట్టుక సహజసిద్దమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్‌ మైఖేల్‌ ర్యాన్‌ శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. వుహాన్‌ ల్యాబ్‌తో వైరస్‌కు లింకు ఉన్నదని ట్రంప్‌ వ్యాఖ్యు చేసిన నేపథ్యంలో ఆయన ఈ సమాధానం ఇచ్చారు. నోవెల్‌ కరోనా వైరస్‌ జంతువు నుంచి మనుషుకు సోకినట్లు శాస్త్రవేత్తు నమ్ముతున్నారని ర్యాన్‌ చెప్పారు.  వుహాన్‌లో ఉన్న సముద్ర జీవు ఆహార మార్కెట్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అనుమానాు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ జన్యు క్రమాన్ని గుర్తించిన శాస్త్రవేత్తు అందరూ అది సహజసిద్దమైనదే అని పేర్కొన్నట్లు ర్యాన్‌ తెలిపారు. ఇది సహజసిద్దమైన వైరస్‌ అని స్పష్టం చేస్తున్నట్లు మరోసారి తెలిపారు. వైరస్‌కు నేచురల్‌ హోస్ట్‌ ఏంటన్న విషయాన్ని తాము నిర్దారించినట్లు చెప్పారు. అయితే జంతువు నుంచి మనుషుకు ఎలా వైరస్‌ వ్యాపించిందన్న అంశాన్ని ఇంకా పరిశీలించాన్నారు. వైరస్‌ గురించి ప్రపంచదేశాకు తెలియజేసేందుకు తాము ఏ క్షణం కూడా ఆస్యం చేయలేదని డైరక్టర్‌ టెడ్రోస్‌ తెలిపారు. కరోనాపై ముందే హెచ్చరించాంనోవెల్‌ కరోనా వైరస్‌ గురించి ప్రపంచదేశాకు తెలియజేయడంలో ఎటువంటి జాప్యం జరగలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్లెడిరచింది. తాము ఎక్కడా సమయాన్ని వృధా చేయలేదని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్‌ టుడ్రోస్‌ తెలిపారు. జనవరి 30వ తేదీనే తాము అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించామని, దీంతో ప్రపంచ దేశాు స్పందించేందుకు కావాల్సినంత సమయం ఇచ్చామన్నారు. ఆ సమయంలో చైనా బయట కేవం 82 కేసు మాత్రమే ఉన్నాయన్నారు.  ఎవరూ చనిపోలేదన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 32 క్ష పాజిటివ్‌ కేసు ఉన్నాయి. 2.34 క్ష మంది వైరస్‌తో చనిపోయారు. అయితే డబ్ల్యూహెచ్‌వో విఫమైనట్లు ట్రంప్‌ ఆరోపణు చేయడంతో.. టెడ్రోస్‌ ధీటుగా స్పందించారు. వైరస్‌ను అధ్యయనం చేసేందుకు తాము చైనా వెళ్లినట్లు కూడా చెప్పారు. తాము వైరస్‌ గురించి ప్రకటన చేసిన తర్వతా మూడు నెలకు అది మహమ్మారిగా మారినట్లు చెప్పారు. చైనాపై ట్రంప్‌ ఆరోపణు కూడా ఆయన ఖండిరచారు.