డబ్ల్యూహెచ్‌వోకు నిధు ఆపేస్తున్నాం
` ప్రకటించిన ట్రంప్
` కరోనా ముప్పును సకాంలో గుర్తించలేదని ఆరోపణ
వాషింగ్టన్,ఏప్రిల్ 15(జనంసాక్షి): ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా అందిస్తున్న నిధు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వ్లెడిరచారు. బుధవారం శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్… కరోనా విషయంలో చైనాకు అనుకూంగా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిన తీరు సరైంది కాదని దుయ్యబట్టారు. డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్న నిధు నిలిపి వేయానిపానా యంత్రాంగాన్ని ఆదేశించాను. కరోనా వైరస్ వ్యాప్తి గురించి అప్రమత్తం చేయడంలో ఆ సంస్థ విఫమైందని, కీక విషయాు దాచి పెట్టడంలో దాని పాత్ర ఉందని సవిూక్షా సమావేశంలో అంచనాకు వచ్చాం. చైనాలో ఏం జరుగుతుందో అందరికీ తొసు. అమెరికా పన్ను చెల్లింపుదాయి ఏడాదికి 400 నుంచి 500 మిలియన్ డార్లు డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్నారు. చైనా కేవం 40 మిలియన్ డార్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోంది. భారీ మొత్తంలో నిధు సమకూరుస్తున్న అమెరికాకు.. సంస్థను జవాబుదారీగా ఉండాని పట్టుబట్టడం అనేది తన కర్తవ్యంలో భాగమేఅని ట్రంప్ పేర్కొన్నారు. కాగా చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి ధాటికి అక్కడ 25 వేకు పైగా మరణాు సంభవించగా… 6 క్షకు పైగా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. రోజురోజుకీ కరోనా బాధితు, మృతు సంఖ్య పెరుగతుండటంతో ప్రజు బెంబెలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ వైఫ్యం వల్లే ఇదంతా జరిగిందని ట్రంప్ ఆరోపిస్తూ.. ఇందుకు ప్రతిగా నిధు నిలిపివేస్తామని కొన్ని రోజుగా హెచ్చరిస్తున్నారు. తాజాగా తన నిర్ణయాన్ని
అము చేయాంటూ అధికారుకు ఆదేశాు జారీ చేసి గట్టిషాకిచ్చారు. దీంతో ఆర్థికపరంగా సంస్థకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇక ట్రంప్ హెచ్చరికపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారిని అరికట్టేందుకు అమెరికా, చైనా సహా ఇతర దేశాు కలిసికట్టుగా పోరాడాని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.