డయల్‌ యువర్‌ ఎప్పీకి 18 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 26 : జిల్లా పోలీస్‌ కార్యాయలం నుంచి సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి నుంచి 18 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ విక్రంజిత్‌దుగ్గల్‌ వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ సంబంధిత ఎస్సైలు ఫిర్యాదులను యుద్ధప్రాతిపాకన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తున్నదని అన్నారు.