డయల్‌ యువర్‌ ఎస్పీలో 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఆధ్వర్యంలో సోమవారం డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు 08462-228433 ఫోన్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలలో నుండి ప్రజలకు గల వివిధ రకాల సమస్యలపై మొత్తం 9 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల పట్ల జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌.సైదయ్య ఉన్నారు.