డిజిటిల్ అసమానతలతో చదువువ మానేస్తున్న పేదలు
అందరికీ విద్య అన్నది కరోనా తుడిచేసింది.
న్యూఢల్లీి,డిసెంబర్31 (జనం సాక్షి) : కొవిడ్ కాలంలో పెరిగిపోయిన డిజిటల్ అసమానతలకు ఒక తరం యువ విద్యార్థులు బాధితులు అయ్యారు. స్మార్ట్ ఫోన్లు లేని కోట్లాదిమంది విద్యకు దూరం అయ్యారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు సత్వరమే గుర్తించాలి. ఆ అసమానతలను రూపుమాపేందుకు అత్యవసరంగా పటిష్ఠ చర్యలు చేపట్టాలి. 15 రాష్టాల్ల్రోని గ్రావిూణ ప్రాంతాలలో నిర్వహించిన ఒక జాతీయ విద్యాసర్వేలో 3వ తరగతి బాలల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే ఒక సామాన్య వాక్యాన్ని సరిగా చదవగలిగారని వెల్లడయింది! మాధ్యమిక పాఠశాలల విద్యార్థుల్లో 17 శాతం మంది కొవిడ్ కాలంలో చదువు మానివేశారన్న విషయం బయటపడిరది. కోటి మంది బాలికలు కూడా ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపివేయక తప్పని పరిస్థితులను ఎదుర్కొన్నట్లు జాతీయ విద్యాహక్కు ఫోరం విధాన పత్రం ఒకటి పేర్కొంది. దేశవ్యాప్తంగా 33 లక్షల మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు తక్షణమే పూనుకోవాలి. పర్యావరణ చైతన్యాన్ని సెమినార్‌లకు పరిమితం చేయకుండా దానిని ఆచరణలోకి తీసుకురావాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వాయు కాలుష్యాన్ని, అడవుల వినాశనాన్ని సత్వరమే అడ్డుకోకపోతే ప్రమాదం తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.