డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

– 54వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు.
– మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య.
ఊరుకొండ, సెప్టెంబర్ 16 (జనం సాక్షి):
వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం 54వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఆశయ సాధన కోసం ఊరుకొండ మండల విఆర్ఏ లు తమ డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమింప బోమని తెలియజేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ.. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ డీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు