డిల్లీలో సీఎం కేసీఆర్‌ బీజీ బిజీ

3

– పారికర్‌, రాజ్‌నాథ్‌లతో భేటీ

– బైసన్‌ పోలో, జింఖానా గ్రౌండ్‌లు ఇచ్చేందుకు సుముఖత

– రెండు నూతన సైనిక్‌ స్కూళ్లకు అంగీకారం

న్యూఢిల్లీ,మే7(జనంసాక్షి):

రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌తో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు.  ఉదయం ఆయన పారికర్‌తో సమావేశమై కంటోన్మెంట్‌ భూముల తరలింపుతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం 40 నిమిషాలపాటు కొనసాగింది. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌ సమావేశ వివరాలను వెల్లడించారు. నూతన సెక్రటేరియట్‌ నిర్మాణం కోసం జింఖానా, బైసన్‌ పోలో స్థలాలను ఇవ్వాలని సీఎం కోరారని అందుకు పారికర్‌ సానుకూలంగా స్పందించారని వివరించారు. అందుకు రక్షణశాఖకు ప్రత్యామ్నయ స్థలాలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారన్నారు. త్వరలోనే అధికారులతో స్థలాలను పరిశీలిస్తామని రక్షణ మంత్రి హావిూ ఇచ్చారని తెలిపారు. ఇక్కడ సచివాలయ నిర్మాణానికి ప్రబుత్వం సంకల్పించింది. ప్రధానంగా జెబిఎస్‌ నుంచి కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిలో హకీంపేట వరకు రోడ్డు విస్తరణ కంటోన్మెంట్‌తో ముడిపడి ఉంది. దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రెండు నూతన సైనిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని సీఎం కోరారని పేర్కొన్నారు. కరీంనగర్‌, మెదక్‌ జాతీయ రహదారుల వెడల్పు పక్రియలో డిఫెన్స్‌ భూములను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారన్నారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లను తరలించేందుకు కంటోన్మెంట్‌ నుంచి పైప్‌ లైన్లు వేసేందుకు అనుమతివ్వాలని సీఎం కోరారని వెల్లడించారు. తెలంగాణ సచివాలయాన్ని సికింద్రాబాద్‌ పోలో గ్రౌండ్స్‌ లో కి మార్చాలన్న ఆలోచనతో ఉన్న కెసిఆర్‌ ఆ భూములను తమకు ఇవ్వాలని పారికర్‌ ను కోరారు.దీనిపై వారి మద్య చర్చ జరిగింది. కాగా గోల్కొండ కోట స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కెసిఆర్‌ కోరుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఎర్రగడ్డ వద్దకు మార్చాలని తొలుత అనుకున్నారు. సాంకేతికంగా అందుకు సమస్యలు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా విమానాశ్రయం వల్ల బహుళ అంతస్థుల భవనాలు నిర్మించడం ఇబ్బంది అవుతుంది. దాంతో సికింద్రాబాద్‌ లోని కంటోన్మెంట్‌ భూములపై దృష్టి పెట్టారు. ఈ నేపధ్యంలో కెసిఆర్‌ డిల్లీలో రక్షణ మంత్రితో సంప్రదింపులు జరిపారు.

అనంతరం సిఎం కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో  భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ భధ్రత, మెగాసిటీ పోలిసింగ్‌ నిధులు, మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ పోలీసింగ్‌ అంశాలపై రాజ్‌నాథ్‌తో సీఎం చర్చించనున్నారు. రాష్ట్రంలోని భద్రతా వ్యవస్థను గురించి రాజ్‌నాథ్‌సింగ్‌ కు వివరించనున్నారు. సీఎంతోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి,డీజీపీ అనురాగ్‌శర్మ రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.