డిసెంబర్ 2న ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ కమిటీ వనభోజనం
ఖమ్మం, నవంబర్ 27 డిసెంబర్ 2వ తేదీన ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ సమీపంలోని ఆరంపాలతోటలో వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా బాధ్యుడు నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు అసోసియేషన్‌లో సభ్యత్వ నమోదు చేసుకోని వారు సభ్యత్వం తీసుకొని కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన తెలిపారు.