డిసెంబర్ 4న ఎఐవైఎస్ ధర్నా
ఖమ్మం, నవంబర్ 27 : అఖిల భారత యువజన సమక్ష (ఎఐవైఎస్) జాతీయ కమిటీ ఆధ్వర్యంలో విద్యా ఉపాధి హక్కుల సాధన కోసం డిసెంబర్ 4న పార్లమెంట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కరుణకుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల విద్య వ్యాపారంగా మారిందన్నారు. ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గ్రామ పంచాయితీ, రెవెన్యూ, వైద్య రంగంలో లక్షల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ ఉద్యోగా భర్తీలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.