డీఈవో ఆఫీస్ కు తాళం వేసిన బీసీ విద్యార్థి సంఘం-పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్

భువనగిరి టౌన్ జనం సాక్షి ):–
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూలు అధిక ఫీజుల వసూలు చేస్తున్న పట్టించుకోని విద్యాశాఖ నిరసనగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ తుమ్మేటి మహేష్ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులతో కలిసి ఆఫీస్ కు తాళం వేయడం జరిగింది విద్యార్థులు పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తుంటే వెంటనే పోలీసులు చేరుకొని డీఈవో బయటకు వచ్చి వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో DEO గారికి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చిన ఒక్క స్కూలు మీద గిట్ల చర్యలు తీసుకోలే కార్పొరేట్ విద్యాసంస్థలు కొమ్ము కాస్తుంది విద్యాశాఖ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విద్యను వ్యాపారం చేయొద్దన్న ప్రవేట్ విద్యాసంస్థలు ఆ ఉత్తర్వులను పెడచెవ్విన పెట్టి ట్యూషన్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, డొనేషన్ ఫీజు, బుక్స్ ఫీజు, బస్సు ఫీజు, అని అధిక ఫీజులతో విద్యార్థుల రక్తం తాగుతున్నారు,టెట్టు క్వాలిఫై కానీ టీచర్లతో టీచింగ్ చెప్పిస్తున్నారు వ్యాలిడిటీ అయిపోయినటువంటి స్కూల్ బస్సులు నడిపిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యులు, ప్రభుత్వం ఏమో అవినీతిపై ఉక్కుపాదం మోపుతం అనుకుంటానే ప్రవేట్ విద్యా సంస్థలకు దోచిపెడుతుంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు సప్పులు తెచ్చే ఆత్మహత్యలు చేసుకుని ఫీజులు కడుతుంటే ప్రభుత్వ నాయకులు స్పందిస్తలేరు 2005లో హైకోర్టు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే ఆ జీవోను అమల్లోకి తీసుకొస్తలేరు ఎందుకంటే ప్రైవేట్ విద్యాసంస్థలు మొత్తం ఈ బీఆర్ఎస్ ఈ నాయకులవే కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయకుండా ఈ ప్రభుత్వం జాప్యం చేస్తుంది గత పది రోజుల్లో కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ స్కూలు అస్తవ్యస్తమైనయీ వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పించి ప్రవేట్ స్కూల్ లపై ఒక కమిటీ వేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విద్యాసంస్థలను రద్దు చేయాలని హెచ్చరించారు లేకుంటే ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు ఆఫీసులు స్తంభింప చేసి బస్సులు దవనం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన శంకర్, నరాల భాను, సాయికుమార్, రాజ్ కుమార్, సాగర్, అరవింద్, భార్గవి, లక్ష్మీ ప్రసన్న,అర్చన, ప్రణీత, అనూష, మల్లేశ్వరి, వెన్నెల, పూజ, నందిని, శివకుమార్ పరశురాం గౌడ్, శీను తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు