డీఎస్!..చెత్త ఎత్తు చిత్తశుద్ధి నిరపించుకో..
హైదరాబాద్,జులై10(జనంసాక్షి):
బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన డీఎస్ ముందుగా హైదరాబాద్‌లో చెత్త ఊడ్చాలని వీహెచ్ ఎద్దేవా చేశారు.2జీ స్కాంపై ఊరూరా ప్రచారం చేసిన మోదీ వ్యాపం కుంభకోణంపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. అన్నిటికి మంచిన కుంభకోణం వ్యాపం అని అన్నారు. ఇందులో లక్షలమంది ఇన్వాల్వ్ అయ్యారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలపై ఎందుకు స్పందించరని అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ వెంటనే హైదరాబాద్‌లో చెత్త ఊడ్చాలని తన భజనపరులను మోదీ ఆదేశించాలన్నారు. పరిశుభ్రతకు మారుపేరుగా ఉండే హైదరాబాద్ నగరం కేసీఆర్ హయాంలో చెత్త సిటీగా మారిందని కాంగ్రెస్ మరో నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ 42 వేల మంది కార్మికులు సమ్మె చేస్తుంటే కేసీఆర్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. పాతబస్తిని ఇస్తాంబుల్ చేస్తామన్న హావిూ ఏమైందని ఆయన ప్రశ్నించారు. బంగారు తెలంగాణను చెత్త తెలంగాణగా మారుస్తున్నారని షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం సమ్మె చేస్తున్నారని,వారి కోర్కెలు సమంజసమైన వేనని ఆయన అన్నారు. కెసిఆర్ వీటిపై స్పందించడంలో విఫలం అయ్యారని అన్నారు. ఫలితంగా హైదరాబాద్ అంతా చెత్తమయం అయిందని అన్నారు.ప్రభుత్వం ఇలాగే ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలే చెత్త ఎత్తే పనిలో ఉంటారని ఆయన చెప్పారు.హైదరాబాద్ లో ఏర్పడిన పారిశుద్ద్య సమస్యపై గవర్నర్ నరసింహన్ స్పందించాలని కూడా షబ్బీర్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే రంజాన్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇవ్వనున్న ఇఫ్తార్ విందును బహిష్కరించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా ఎట్¬ంకు ఆహ్వానించకపోవడంపై నిరసనగా టి.పీసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.