డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు

మహాదేవపూర్. సెప్టెంబర్ 24 ( జనంసాక్షి )

మహదేవపూర్ మండల డిటీఎఫ్ కౌన్సిల్స్ సమావేశం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించారు,ఈ సమావేశమునకు జిల్లా డిటి ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏ తిరుపతి,ముఖ్యఅతిథి గా డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఏ లక్ష్మణ్ నాయక్ మహాదేవపూర్ పలిమెల జోన్ బాధ్యులు మరియు జిల్లా కమిటీ కార్యదర్శి శ్రీ బొమ్మన తిరుపతి రెడ్డి .జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి ప్రభాకర్ రెడ్డి మహాదేవపూర్ మండల అధ్యక్షులు శ్రీ మడక మధు హాజరై డిటిఎఫ్ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు కలిసి ఈ కౌన్సిల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.మండలంలోని డిటిఎఫ్ సభ్యత్వాన్ని 100 శాతం వరకు పెంచాలని డిటిఎఫ్ జిల్లా రాష్ట్ర శాఖ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని,విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధోరణిపై ఈ ప్రాంతంలో ఒక మెగా సెమినార్ ఏర్పాటు చేయడం.సిపిఎస్ ను రద్దు చేసి, ఓ పి ఎస్ సాధించడం కు ప్రభుత్వంపై ఉద్యమించడం కొరకు కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని .జీవో నెం.317 వలన ఇబ్బందులకు గురి అవుతున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు న్యాయం చేయడం.మన ఊరు మా బడి అనే కార్యక్రమం ఎలాంటి ప్రయోజనం చేయడం లేదని విమర్శిస్తూ.అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు మండల అధ్యక్షులు గా మడక మధు మండల ప్రధాన కార్యదర్శి గా .కొత్తపల్లి సరంగని .ఉపాధ్యక్షులు గా ఆర్ రామ్మూర్తి .ఎర్రయ్య సునీత కార్యదర్శి గా తిరుపతి .కోటేష్ .రజిత . హరీష్ .జిల్లా కౌన్సిలర్లు శంకరయ్య .ప్రభాకర .మొండయ్య తిరుపతి ఆడిట్ సభ్యులు .మల్లేష్ .ప్రకాష్ ఎన్నుకున్నారు