డెల్టాకన్నా ఒమిక్రాన్ తీవ్రమైందేవిూ కాదు
అది వేగంగా మాత్రమే వ్యాప్తి చెందుతుంది
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ
వాషింగ్టన్,డిసెంబర్8 జనం సాక్షి : గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ విధ్వంసకరమైంది ఏవిూకాదని ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీలక అంశాన్ని వెల్లడిరచారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమే అని, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందని, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏవిూ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్న దానిపై ల్యాబ్‌లో పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు మరికొన్ని రోజుల్లో వస్తాయని ఫౌసీ చెప్పారు. ఇక ఒమిక్రాన్‌తో కలిగే వ్యాధి తీవ్రత గురించి
మాట్లాడుతూ.. ఇది డెల్టా కన్నా ప్రమాదకరమైంది ఏవిూ కాదననారు. దక్షిణాఫ్రికా డేటాను పరిశీలిస్తే, అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, కానీ హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య డెల్టా కన్నా తక్కువగా ఉన్నట్లు ఆంథోనీ చెప్పారు. అయితే దక్షిణాఫ్రికా పరిణామాలను పూర్తిగా అంచనా వేసేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. దాని తీవ్రత తెలుసుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌ను 38 దేశాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాలు ఏవిూ లేకున్నా.. ఆ వైరస్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో ఉన్న 30 మ్యుటేషన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకపై మాత్రం ఇంకా అస్పష్టత ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల టీకాలు తీసుకున్నవాళ్లు అవసరమైతే బూస్టర్ తీసుకోవాలని సూచించారు.