డైట్ డ్రింక్స్,జంక్ ఫుడ్ తో గుండెపోటు

జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డారా.. విపరీతంగా కూల్ డ్రింగ్స్ తాగేస్తున్నారా.. ఎండగా ఉందని లీటర్లకు లీటర్లు కూల్ డ్రింక్స్ సీసాలు ఖాళీ చేస్తున్నారా.. బిర్యానీ విత్ కూల్ డ్రింక్.. లంచ్, డిన్నర్ లో డ్రింక్స్ కామన్ అయ్యాయా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే. మీ గుండెకు ముప్పు ఉన్నట్లే. ఇటీవల డైట్ డ్రింక్స్ పేరుతో అన్ని కంపెనీలు వివిధ ప్లేవర్స్ తో మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఇవి తాగితే మీ గుండెకు పోటు తప్పదంటున్నారు బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు. డైట్ డ్రింక్స్ తాగే వారిలో వచ్చే మార్పులను వెల్లడించారు. దాహంగా ఉందని కొందరు.. స్టయిల్ కోసం మరికొందరు డ్రింక్స్ తాగుతున్నారు. ముఖ్యంగా డైట్ కూల్ డ్రింక్స్ తాగే వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయట. మామూలు వ్యక్తుల కంటే డైట్ డ్రింక్స్ తీసుకునేవారికి మూడు అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం ఉందంట. అంతేకాదు.. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం.. మతి స్థిమితం కోల్పోవటం జరుగుతుందని బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకుల సర్వేలో బయటపడ్డాయంట. పెద్దలపైనే కాకుండా.. పిల్లలపైనా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ బెల్స్ మోగించారు. అలవాటుగా మారటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ డైట్ డ్రింక్స్ తాగితే పిల్లల్లో జ్ణాపక శక్తి తగ్గిపోవటం.. మతిమరుపు రావటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. కృత్రిమ రసాయనాలతో కూడిన స్వీట్నర్ ఎక్కువగా ఉపయోగించడమే దీనికి కారణం అంటున్నారు. డైట్ డ్రింక్ తీసుకుంటున్న 4వేల 400 మంది పెద్దవారిపై అధ్యయనం చేయగా వారిలో ఎక్కువ మందికి గుండె పోటు, తక్కువ జ్ఞాపకశక్తి, మతిస్థితి సరిగా లేక బాధ పడుతున్నట్లు గుర్తించారు. కూల్ డ్రింక్స్ అలవాటు లేనివారితో పోల్చితే.. డైట్ డ్రింక్స్ తీసుకునేవారు మూడు రెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు.