డైలీ వెజ్ వర్కర్స్ ను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి — తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హతీరామ్ నాయక్ డిమాండ్.
టేకులపల్లి, నవంబర్ 18 (జనం సాక్షి): గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ ను రెగ్యులర్ ఉద్యోగులకు గుర్తించాలని తెలంగాణ గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హాతిరామ్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోయగూడెం ఆశ్రమ పాఠశాల ముందు 21 రోజులు గా సమ్మె చేస్తున్న డైలీ వెజ్ వర్కర్స్ కు సంఘీభావం తెలిపారు. వారికి గత 12 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారితో వెట్టి చాకిరీ చేయిస్తూ వారి శ్రమ డోపిడీ చేయడం సరైనది కాదని, వారికి సమాన పనికి సమాన వేతనం ప్రతి నెల 1 వ తారీఖున ఇవ్వాలని, వారికీ హెల్త్ కార్డ్స్ కల్పించాలని, 20 సంవత్సరాలనుండి పని చేసి చనిపోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించాలని అన్నారు. వారి సమస్య తీరేవరకు పోరాటం చేయాలనీ వారికి పూర్తి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు బి. రాంజీ నాయక్, జిల్లా నాయకులు సురేష్, నరేష్ తదితరులు పాలుగోన్నారు.