డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష
ఒకరికి మూడు రోజులు, మరొకరికి ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు
-సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ చలికంటి నరేష్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ చలికంటి నరేష్ కోరారు.పట్టణంలో ప్రతి రోజు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలలో భాగంగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టు నందు హాజరు పర్చినట్లు తెలిపారు.వారిలో ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించగా, మరొకరికి ఒకరోజు జైలు శిక్ష , మరో ముగ్గురికి రూ.2 వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు, డిఎస్పీ నాగభూషణం సూచనల ప్రకారం పట్టణంలో ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదమని పేర్కొన్నారు.మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుపడితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.