డ్రగ్స్‌ డాన్‌ గుజరాత్‌ గుజ్‌మన్‌ అరెస్టు

2

మాదకద్రవ్యాల రారాజు గుజ్‌మన్‌ అరెస్టు

మెక్సికో,జనవరి 9(జనంసాక్షి): మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఆయనో రారాజు.. ఆయన తప్పించుకోవడానికి జైలు నుంచి భారీ సొరంగాన్నే తవ్వారు అనుచరగణం.. అక్కడి నుంచి తప్పించుకొని ఆరునెలల పాటు అటు ఇటూ తిరిగి అదే జైలుకు వచ్చి చేరాడు. ఇది మెక్సికన్‌ మాదకద్రవ్యాల స్మగ్లర్‌ ఇ ఛాపో గుజ్‌మన్‌ కథ. శుక్రవారం మెక్సికన్‌ నావికాదళం తీరప్రాంత పట్టణమైన మోచీస్‌లోని ఓ ఇంటిపై దాడిచేసి పారిపోతున్న గుజ్‌మన్‌ను అరెస్టు చేసింది. ఈ మహాశయుడు 14ఏళ్ల జైలు జీవితంలో రెండు సార్లు తప్పించుకోవడం విశేషం.

నెలరోజుల నిఘా

గుజ్‌మన్‌ను పట్టుకోవడానికి మెక్సికో ప్రభుత్వం భారీ వ్యూహాలను పన్నాల్సి వచ్చింది. అతని ఇంటిపై నెలరోజుల నుంచి నిఘా పెట్టారు. ఎట్టకేలకు పక్కా ఆధారాలు దొరకడంతో శుక్రవారం తెల్లవారు జామున నావికాదళ సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక భద్రతా దళ సిబ్బంది కూడా గాయపడ్డాడు.

సినీఫక్కీలో..

దాడి జరుగుతున్న సమయంలో గుజ్‌మన్‌ ఒక మ్యాన్‌ ¬ల్‌లోకి దూకి పారిపోయాడు. దీంతో నావికాదళ సిబ్బంది అతన్ని వెంటాడారు. అక్కడి నుంచి ఓ దొంగిలించిన కారులో కొంత దూరం తప్పించుకున్నాడు. కానీ చివరికి హైవేకు దూరంగా అతని కారును గుర్తించి అరెస్టు చేశారు.

తన జీవితంపై సినిమాకు ప్లాన్‌..

ఈయనగారు తన జీవితాన్నే కథనంగా మలిచి ఓ సినిమా తీయాలని ప్లాన్‌ చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగా పలువురు నిర్మాతలను, నటులను సంప్రదించాడు. అదే అతని కదలికలను పోలీసులకు చేరేలా చేసింది.