డ్రింకిింగ్‌వాటర్‌ ఆఫ్‌ తెలంగాణ మన స్వప్నం

– హైదరాబాద్‌కు సింగూరు జలాలు

– సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌,ఆగష్టు 291.డ్రింకిింగ్‌వాటర్‌ ఆఫ్‌ తెలంగాణ మన స్వప్నం

– హైదరాబాద్‌కు సింగూరు జలాలు

– సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌,ఆగష్టు 29(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషన్‌ మ్యాన్యువల్స్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతం నుంచి ఎన్ని నీళ్లు మిషన్‌ భగీరథకు ఉపయోగిస్తారో మదింపు చేయాలని, రాష్ట్రం యూనిట్‌ గా గుర్తించి యావత్‌ తెలంగాణ అవసరాలను తీర్చడం కోసం ‘డ్రింకింగ్‌ వాటర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ తెలంగాణను ఏర్పాటు చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఏ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి ఎన్ని నీళ్ల కావాలో లెక్కలు వేసి, వాటి వినియోగానికి సంబంధించి ‘పవర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ భూముల రికార్డుల ప్రకాళన కార్యక్రమాన్ని ఉన్నత స్థాయిలో పర్యవేకించేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మండలానికో రిజిస్టార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి, రెవెన్యూ కార్యాలయాల్లో ఐటి అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వ్యవసాయం, నీటి పారుదల, మిషన్‌ భగీరథ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సంయుక్త సవిూక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌ లో నిర్వహించారు. ?? ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తన్నీరు హరీశ్‌ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్పులు ఎస్‌.కె. జోషి, బి.ఆర్‌.విూనా, ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌ రావు, సీనియర్‌ అధికారి వాకాటి కరుణ, నీటి పారుదల ఇఎన్‌ మురళీధర్‌, మిషన్‌ భగీరథ ఇఎన్పీ సురేందర్‌ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యు సిఇ సత్యనారాయణ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు. ఈ సవిూక్షలో గోదావరి, కృష్ణా నదుల ద్వారా అందుబాటులోకి వచ్చే జలాలను మంచినీరు, సాగునీరు, విద్యుత్‌, పారిశ్రామిక అవసరాల కోసం సమర్థంగా వాడుకునే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.’గోదావరి, కృష్ణా నదులపై అనేక ప్రాజెక్టులు కడుతున్నాం. ఈ రెండు నదుల నీటితో రైతులకు సాగునీరు అందించడంతో పాటు మంచినీరు, పరిశ్రమలకు నీరు, విద్యుత్‌ ఉత్పత్తికి నీరు సరఫరా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా కొత్త ఆపరేషన్‌ మాన్యువల్స్‌ తయారు చేయాలి. ప్రాజెక్టు నుంచి సాగునీరు ఎంతివ్వాలి? మంచినీరు ఎంతివ్వాలి? విద్యుత్‌ కేంద్రాలకు ఎంత నీరు ఇవ్వాలి? పరిశ్రమలకు ఎంతివ్వాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ప్రాజెక్టుల్లో నీరు చేరిన దాన్ని బట్టి కూడా ప్రాధాన్యతలను నిర్ణయించి నీటి విడుదల జరపాలి. దీనికోసం ప్రత్యేక విధానం అమలు చేయాలి. కొత్త ఆపరేషన్‌ మాన్యువల్స్‌ వెంటనే తయారు చేయాలి. నీటి విడుదలకు సంబంధించి ఎప్పటికప్పుడు రాజధాని నుంచి వచ్చే సూచనలు, ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలి. మిషన్‌ భగీరథ అధికారులు కూడా ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు తీసుకుంటున్నాము? ఏఏ ప్రాంతాలకు ఎక్కడి నుంచి నీరు సరఫరా చేస్తున్నాము? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి వాడుకునే నీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితినివ్యవహరించేందుకు డ్రింకింగ్‌ వాటర్‌ ఫ్రంట్‌ ఫుర్‌ తెలంగాణను నెలకొల్పాలి. ఇదే విధంగా పవర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ తెలంగాణను కూడా ఏర్పాటు చేయాలి. వారు కూడా ఏ ప్రాజెక్టు నుంచి ఏ విద్యుత్‌ కేంద్రానికి ఎన్ని నీళ్లు కావాలో? అవి ఎలా పొందాలో? స్పష్టమైన అంచనాకు రావాలి. పరిశ్రమలకు కూడా ఇదే విధమైన ఏర్పాటుండాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.నీటి పారుదల, మిషన్‌ భగీరథ, విద్యుత్‌, పరిశ్రమల శాఖల అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని నదీ జలాల వాడకంపై అవగాహనకు రావాలని సిఎం ఆదేశించారు.”ప్రాజెక్టుల నీటిలో మంచినీటికి అధిక ప్రాధాన్యమిస్తాం. ఇందుకోసం అన్ని రిజర్వాయర్లలో 10 ?బి9నీ నీటిని మంచినీటికి రిజర్వు చేశాం. ఆ నీటిని సమర్థంగా వాడుకోవాలి. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందుబాటులోకి వస్తాయి. కాళేశ్వరం ద్వారా పాత వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందుతుంది. కాబట్టి మిషన్‌ భగీరథ అధికారులు రెండు రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడున్న నీటి లభ్యత, వనరులను బట్టి వచ్చే ఏడాది జూలై నాటికుండే పరిస్థితిని అంచనా వేసి ప్రణాళిక సిద్దం చేయాలి. కాళేశ్వరం నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాశ్వత ప్రణాళిక వేసుకోవాలి. హైదరాబాద్‌ తో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా లెక్కలు వేసుకుని ఎన్ని నీళ్లు అన్ని నీళ్లు తీసుకుని మంచినీరుగా అందివ్వాలి” అని సిఎం సూచించారు.కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున హైదరాబాద్‌, నల్గొండ జిల్లాలకు మంచినీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సింగూరు నుంచి హైదరాబాద్‌ కు నీటిని వదలాలని, నాగార్జున సాగర్‌ నుంచి అక్కంపల్లి ద్వారా ఉదయ సముద్రానికి నీరు వదిలి నల్గొండ జిల్లాకు మంచినీరివ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు, ఇ.ఎన్‌.సి మురళీధర్‌ రావును ఆదేశించారు. సింగూరు నుంచి హైదరాబాద్‌ కు, అక్కంపల్లి నుంచి ఉదయ సముద్రానికి మంగళవారం రాత్రి నుంచే నీటి విడుదల జరగాలని ఆదేశించారు. కృష్ణా నదిలో ఈ సారి వరద నీరు రాలేదని, నాగార్జున సాగర్లో నీరు డెడ్‌ స్టోరేజి కంటే తక్కువ ఉందని, ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. ఈ పరిస్థితిలో కృష్ణా నది నీళ్లపై ఆధారపడిన హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల్లో మంచినీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు.హైదరాబాద్‌ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారాలుగా రెండు రిజర్వాయర్లు నిర్మించాలని చెప్పారు. ఒక దాన్ని కాళేశ్వరం ద్వారా వచ్చే గోదావరితో నింపాలని, రెండో దాన్ని కృష్ణా నదీ జలాలతోనింపాలన్నారు. ప్రస్తుతమున్న హిమాయత్‌ సాగర్‌, గండిపేట చెరువుల సామర్థ్యం చాలా తక్కువని, అవి నగర అవసరాలు తీర్చలేవని చెప్పారు. కరువు వచ్చినా, నదీ జలాలు అందుబాటులో లేకున్నా సరే, హైదరాబాద్‌ నగర వాసులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే త్వరితగతిన రిజర్వాయర్ల నిర్మాణం కావాలని చెప్పారు.

31న కలౌకర సమావేశం :

భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశనం చేసేందుకు ఈ నెల 31న జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ప్రగతి భవన్‌ లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం రోజంతా ూఈ6ఈఆళీబ్భ్పుఇ300ీ. సెప్టెంబర్‌ 1 సమన్వయ కమిటీల నియామకం జరగాలని, సెప్టెంబర్‌ 15 నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభించాలని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డుల నిర్వహణ, పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో మార్పులు, పహాణి పత్రాల్లో మార్పులు, రిజిస్టేషన్‌ విషయంలో సంస్కరణలు తదితర అంశాలపై విధి విధానాలకు తుదిరూపం ఇచ్చి కలెక్టర్ల సమావేశంలో వెల్లడించాలని సిఎం చెప్పారు.

31న వ్యవసాయాధికారుల సమావేశం :

ఈనెల 31 హైదరాబాద్‌ లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో వ్యవసాయాధికారుల సమావేశం జరుగుతుంది. భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘూలు, రైతు సమన్వయ సమితిల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు.ప్రతీ మండలానికో రిజిస్టార్‌ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్ఫిని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న రిజిస్టార్‌ కార్యాలయాలు, రిజిస్టార్లను యధావిధిగా కొనసాగిస్తూ రిజిస్టార్‌ కార్యాలయాలు లేని మండలాల్లో కొత్తవి నెలకొల్పాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే రిజిస్టార్‌ కార్యాలయాలకు రిజిస్టార్లుగా మండల రెవెన్యూ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. అవినీతికి, జాప్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా రిజిస్టేషన్‌ విభాగంలో పెద్దఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మండల స్థాయిలోనే రిజిస్టార్‌ కార్యాలయం ఉండడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. బ5 బ్యాంకింగ్‌ విధానంలాగానే ఇకపై భూముల రిజిస్టేషన్లు, క్రయ విక్రయాల వివరాలన్నీ ఇకపై ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్లో అప్‌ డేట్‌ అవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో భూ రికార్డుల నిర్వహణ కోసం, కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో భూముల క్రయ విక్రయాల వివరాల నమోదు వెయ్యి మంది ఐటి అధికారులను నియమించాలని సిఎం ఆదేశించారు. రిజిస్టేషన్‌ అయిన రోజే మ్యుటేషన్‌ కూడా పూర్తి కావాలన్నారు.’గతంలో భూమి శిస్తు వసూలు చేసే వారు. దానికి అనుగుణంగా పహాణీలు తయారు చేశారు. కానీ ఇప్పుడు భూమి శిస్తు వసూలు చేయడం లేదు. పైగా ప్రభుత్వమే ఎకరాకు 8వేల చొప్పున పెట్టుబడి ఇస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పహాణిలో వున్న 31 కాలమ్స్‌ అవసరం వుందా లేదా అనే ఆలోచన చేయాలి. కేవలం రైతుల ఖాతాల వివరాలు మాత్రమే ఉంచి, మిగతావి తొలగిస్తే సరళంగా ఉంటుంది. గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, అసైన్స్‌ భూములు, అటవీభూములు, దేవాదాయ భూములు, వక్స్‌ భూములు, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల రికార్డులను ప్రత్యేకంగా నిర్వహించాలి. భూ వివాదాలకు సంబంధించి కూడా ఇన్ని కోర్టులు అవసరం లేదు. కలెక్టర్‌ కోర్టు ఒక్కటే ఉండాలి. మిగతావి రద్దు చేయాలి. పట్టాదారు పాసు పుస్తకాల్లో, పహాణీల్లో వాడే భాష సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అర్థం కాని పదాల బదులు అందరికీ అర్థమయ్యే తెలుగు భాషను వాడాలి. పహాణీలను కంప్యూటర్లో డౌన్‌ లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉండాలి. వ్యవసాయ శాఖకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేకమైన బడ్జెట్‌ రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్ఫి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి, విధి విధానాల ఖరారు చేయాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.