డ్రిప్‌తో కూరగాయల సాగు మేలు
కామారెడ్డి,మే29(జనం సాక్షి): డ్రిప్ ఉపయోగించి కూరగాయల సాగుతో లాభాలు గడించవచ్చని వ్యవసాయాధికారులు సూచించారు. ఇందుకు వ్యవసాయ శౄఖ ఇతోధికంగా సూచనలు చేయడంతో ఆపటు పరికరాలను కూడా సరఫరా చేస్తుందని అన్నారు. బోరుబావుల్లో తక్కువ నీరు ఉన్నప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగు చేయవచ్చునని అన్నారు. సాగునీరు తక్కువగా ఉన్నచోట రైతులు డ్రిప్‌ను ఉపయోగించి, ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలని అన్నారు. డ్రిప్ ఉపయోగించి కూరగాయల సాగు, మామిడి, నిమ్మ, తదితర తోటలను సాగు చేసి, అధిక దిగుబుడులు సాధించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభు త్వం రైతు సంక్షేమ కోసం కృషి చేస్తోందని, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందిస్తోందన్నారు. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు పొంద వచ్చునని తెలిపారు.