డ్రోన్‌లపై నిషేదాజ్ఞలు
కరీంనగర్, సెప్టెంబర్ 8 జనంసాక్షి):కరీంనగర్ పోలీస్ కవిూషనరేట్ పరిధిలో భద్రతాకారణాలదృష్ట్యా పారాగ్లైడర్స్ రిమోట్ కంట్రోల్ డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్‌ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కవిూషనర్ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈనిషేదాజ్ఞలు అక్టోబర్ 7వ తేదీవరకు అమల్లో ఉంటాయన్నారు. సాంకేతిక పరికరాలను ఈ మద్య కాలంలో వివాహాది శుభకార్యాలు, వివిద కార్యక్రమాల సందర్బం గా వినియోగించబడుతున్నాయన్నారు. ఉగ్రవాదులు అసాంఘీక శక్తులు వీటిని వినయోగించే అవకాశాలుండడంతో సదరు సాంకేతిక పరి కరాల వినియోగాన్ని అనుమతి నిషేదించడం జరిగిందన్నారు. ఎవరైనా వినియోగించదలిచితే సంబందిత పోలీస్‌అదికారుల అనుమతి తీసుకోవాలన్నారు, ఈమేరకు పోలీఈస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. నిబందనలను ఉల్లంఘించిన వారిపైఐపిసి సెక్షన్ 188ప్రకా రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.