ఢల్లీిలో కొవిడ్ ఉధృతి .. ` నైట్ కర్ఫ్యూ అమలు
దిల్లీ,డిసెంబరు 26(జనంసాక్షి):దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. దిల్లీలో కొవిడ్ కేసుల పెరగడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.దిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 290 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒకరు మృతి చెందారు. ఒమిక్రాన్ భయాల వేళ పాజిటివిటీ రేటు సైతం 0.55 శాతం మేర పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులు కలుపుకొని దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 14,43,352కు చేరగా.. మరణాల సంఖ్య 25,105కి పెరిగింది. దిల్లీలో ఇప్పటి వరకు 79 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.