ఢల్లీిలో చంద్రబాబుకు చేదు అనుభవం
సొంతపార్టీ ఎంపికేశినేని పెద్ద షాక్
స్వాగత కార్యక్రమంలో బొకే ఇచ్చేందుకు నాని నిరాకరణ
అవాక్కయిన టిడిపి అధినేత చంద్రబాబు
సోషల్ విూడియాలో వైరల్‌గా మారిన వీడియో
న్యూఢల్లీి,ఆగస్ట్6( జనం సాక్షి): టిడిపి అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురయ్యింది. సొంత పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని బాబు పట్ల అసహనం ప్రదర్శించారు. చంద్రబాబు ముందే విభేదాలు బయటపడ్డాయి. ఢల్లీి వెళ్లిన చంద్రబాబుపై కేశినేని నేరుగా అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నాని నిరాకరించారు. బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ బతిమాలినా కూడా కేశినేని లెక్కచేయలేదు. చంద్రబాబు పక్కన నడిచేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. అందరి ముందు కేశినేని వైఖరి చూసి చంద్రబాబు నిర్ఘాంతపోయారు. ఇటీవల కేశినేని నాని సోదరుడిని చంద్రబాబు ప్రోత్సహి స్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో ఈ విషయంపై కేశినేని వాగ్వాదం జరిగింది. తన తమ్ముడిని ప్రోత్సహించడంపై కేశినేని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.ఢల్లీిలో జరగనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరవుతున్నారు. శనివారం ఉదయం ఢల్లీికి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఎంపిలతో కలసి వచ్చిన విజయవాడ ఎంపికేశినేని నాని చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు నిరాకరించారు. చంద్రబాబుకు బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ అందించబోగా నాని తిరస్కరించారు. కనీసం చంద్రబాబు దగ్గరకు వెళ్లేందుకు కూడా నాని ఇష్టపడలేదు. బహిరంగ నిరసన తెలిపేందుకే నాని ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ విూడియాలో వైరల్ అవడంతో టీడీపీలో చర్చకు దారితీసింది. తాజాగా చంద్రబాబు.. నాని ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఆయన హుషారుగానే కనిపించారు. ఏపీలో గత కొద్ది రోజులుగా కేశినేని నాని అంశం చర్చనీయాంశంగా మారింది. తన తమ్ముడు కేశినేని చిన్ని కారు ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారని కేశినేని నాని కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గత ఎన్నికల్లో విజయవాడనుంచి టీడీపీ ఎంపీగా కేశినేని గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో యాక్టివ్‌గానే ఉన్నారు. కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని కూడా టీడీపీలో ఉన్నారు. సడెన్‌గా కుటుంబ విభేదాలు బయట పడటం.. అదీ సొంత తమ్ముడిపై కేశినేని కేసు పెట్టడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని తిరుగుబాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని.. 60 సీట్లు మాత్రమే గెలుస్తుందని.. అందుకే ఇప్పటి నుంచే టీడీపీ ఎంపీ కేశినేని నాని .. ఆ పార్టీ నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నేడు కేశినేని నాని వ్యవహరించిన తీరుతో ఈ ప్రచారం నిజమేనని అంతా భావిస్తున్నారు.