ఢల్లీిలో నూతన మద్యం విధానం అమలులో విఫలం
11మంది అధికారులపై వేటు వేసిన లెఫ్టినెంట్ గవర్నర్
న్యూఢల్లీి,అగస్ట్6(జనం సాక్షి)): 2021`22 మద్యం విధానాన్ని అమలు చేయడంలో విఫలమైన అధికారులపై ఢల్లీి లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యలు తీసుకున్నారు. 11 మంది అధికారులపై ఆయన సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఢల్లీి ఎక్సైజ్ కవిూషనర్ అరవ్ గోపి కృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కవిూషనర్ ఆనంద్ కుమార్ తివారిలుఉన్నారు. నూతన మద్యం విధానాన్ని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు ముగ్గురు అడ్‌హక్ అధికారులు, ఆరు మంది ఢల్లీి ఎక్సైజ్ శాఖ అధికారులపై సస్పెన్షన్ విధించారు. టెండర్లను ్గªనైలైజ్ చేయడంలో, సంబంధిత వెండర్లకు టెండర్ బెనిఫిట్లను చేరవేయడంలో విఫలమైన అధికారులపై వేటు వేసినట్లు గవర్నర్ ఆఫీసు పేర్కొన్నది. డైరక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గవర్నర్ సక్సేనా ఈ చర్యలకు దిగారు.