ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జెండావిష్కరించిన డిప్యుటీ సీఎం మహమూద్ అలీ
ఢిల్లీ, జూన్2(జనంసాక్షి)-
దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలకు డిప్యుటీ సీఎం మహమూద్ అలీ హాజరయ్యారు. జెండావిష్కరించిన మహమూద్ అలీకి ఢిల్లీలోని తెలంగాణ బిడ్డలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతూ అవినీతి రహిత రాష్ట్రంగా ఎదగాలని అన్నారు. టపాసులు కాలుస్తూ, జైతెలంగాణ నినాదాలతో ఢిల్లీ తెలంగాణ భవన్ మార్మోగింది. ఈ వేడుకల్లో ఎంపీ వినోద్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, ప్రభుత్వ ప్రతినిధులు రామచంద్రుడు, వేణుగోపాలచారి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ఏడాది సాధించిన ఫలితాలు అద్భుతమని, మున్ముందు సాధించాల్సింది చాలా ఉందని ఎంపీ వినోద్ అభిప్రాయపడ్డారు.