ఢిల్లీలో మోడీ పాగా!

జాతీయ నాయకుడి హోదాను అధికారికంగా కల్పించిన భాజపా
కేంద్రీయ పార్లమెంటరీ బోర్డు, కేంద్రీయ ఎన్నికల కమిటీల్లో చోటు
74 మందితో జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు రాజ్‌ నాధ్‌సింగ్‌
మోడీ మనుషులు అమిత్‌ షా, స్మృతి ఇరానీలకు కీలక బాధ్యతలు
80 శాతం అరవయ్యేల్ల లోపువారే
భాజపాలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రాభవం పెరుగుతున్నట్లు మరోసారి రుజువైంది. ఆదివారం పార్టీ అధ్యక్షుడు రాజ్‌ నాధ్‌సింగ్‌ ప్రకటించిన 74 మంది సభ్యుల జాతీయ కార్యవర్గంలో నరేంద్ర మోడీకి, అయన సన్నిహితులకు అత్యంత ప్రాధాన్యం లభించింది. భాజాపా అత్యున్నత విధాన నిర్ణాయక కేదిక అయిన కేంద్రీయ పార్లంమెంటరీ బోర్డులో, 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే కేంద్రీయ ఎన్నికల్లో కమిటీలో నరేంద్ర మోడీకి స్థానం కల్పించారు. మోడీకి అత్యంత విశ్వాస పాత్రుడైన గుజరాత్‌ మాజీ హోమంత్రి అమిత్‌షాకు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. అయన రెండు బూటకపు ఎన్‌కౌంటర్ల కేసుల్లో నిందుతుడు కావడంతో 2005లో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తెరచాటు రాజకీయాల్లో దిట్ట అయిన అమిత్‌షా వచ్చే ఎన్నికల్లో పార్టీ సంప్రదింపులకూ ఆయనే సంధానకర్త అవుతారు. ప్రమోద్‌ మహజన్‌ బ్రతికి ఉన్న రోజుల్లో ఆయనే ఈ పనులు చేసేవారు.ఆయన మరణం తర్వాత పార్టీలో ఆ అలాగే కోనసాగుతుంది.ఇప్పుడు కోశాధికారి పీయష్‌ గోయల్‌తో కలిసి అమిత్‌షా ఈ వ్యవహరాలను చక్కదిద్దుతారు.మోడీకి సన్నిహితురాలైన మహిళ మోర్చా అద్యక్షురాలు స్మృతి ఇరానీకి ఎకంగా పార్టీ ఉపాద్యక్ష పదవిని కట్టబెట్టారు. ఆమె గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తునారు.కర్ణాటక శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని,అక్కడి ఒక్కళిగలను సంతృప్తిపరచేందుకు మాజీ సీఎం సదానంద గౌడకు ఉపాద్యక్ష పదవిని కట్టబెట్టారు.లింగాయత్‌ నేత జగదీష్‌ షెట్టార్‌ అక్కడ సీఎంగా ఉన్నారు.కొద్ది రోజుల క్రితమే బ్రాహ్మణుడైన ప్రహ్లద్‌ ఎల్‌ జోషిని కర్ణాటక భాజపా అద్యక్షుడిగా నియమించారు.మరో బ్రహ్మణ నేత అనంతకూమార్‌ కేంద్రీయ పార్లమెంటరీ బోర్డులో కొనసాగుతున్నారు.సీనియర్లు యశ్వంత్‌ సిన్హా,,శతృఘ్న సిన్హా ,నజ్మా హెప్తుల్లా, శాంతకుమార్‌,హేమామాలిని,కల్రాజ్‌మిశ్రా,వినయ్‌ కటియార్‌, రమేష్‌ పోక్రియాల్‌,జశ్వంత్‌ సింగ్‌లకు పదవిలేవి దక్కలేదు.అద్వాని బృందాన్ని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలూ వచ్చాయి.అయితే,పార్టీ పగ్గాలు ఈ విమర్శను తోసి పుచ్చాయి. రాజ్‌నాథ్‌ అదివారం అద్వానీని కలిసాకే పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారని చెప్పాయి.