ఢిల్లీలో విపరీతంగా వాయుకాలుష్యం

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో ఇవాళ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దీపావళి సంబరాలు మొదలు కాక ముందే.. వతావరణం ప్రమాదకరంగా తయారైంది. నగరంలో ఉదయం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నది. రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. మందిర్‌ మార్గ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియం సవిూపంలో పీఎం లెవల్స్‌ ప్రమాదకరంగా నమోదు అయ్యాయి. ఎయిర్‌ క్వాలిటీ సరిగా లేదని అధికారులు తేల్చారు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ప్రకారం ఢిల్లీలో ఆదివారం 231 రికార్డు అయ్యింది. తేమ వాతావరణం, ఉష్ణోగ్రతలు పడిపోవడం, పంటను తగలబెట్టడం లాంటి కారణాల వల్ల ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నది.