ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ పని పడతానన్న సుబ్రమణ్యస్వామి

దీక్ష చేస్తున్న ఎంపి మహేశ్‌ గిరికి మద్దతు ప్రకటన
న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నంసాక్షి): ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణలకు నిరసనగా ఆయన ఇంటిముందు గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో బీజేపీ ఎంపీ మహేశ్‌ గిరీ ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీనికి  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మద్దతు పలికారు. ఎంఎం ఖాన్‌ మర్డర్‌ కేసులో మహేశ్‌ దోషి అంటూ సీఎం కేజీవ్రాల్‌ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని ఎంపీ మహేశ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. న్యూఢిల్లీ మున్సిపల్‌ మండలిలో ఎంఎంఖాన్‌ సీనియర్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. అయితే ఆ హత్య కేసులో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కావాలంటే ఆ కేసులో తనను విచారించాలని మహేశ్‌ డిమాండ్‌ చేశారు. లెఫ్ట్నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ఎంపీ మహేశ్‌ను రక్షిస్తున్నారని కూడా కేజీవ్రాల్‌ ఆరోపించారు. ఎంపీ మహేశ్‌కు క్షమాపణలు చెప్పేవరకు ఆయనతో కలిసి ఆమరణ దీక్ష కొనసాగించనున్నట్లు సుబ్రమణ్యస్వామి అన్నారు. అయితే ఆ మర్డర్‌ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల బిజెపిపై తరచూ అనవసర ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ను సుబ్రమణ్యస్వామి టార్గెట్‌ చేశారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌కు రెండో టర్మ్‌ ఇవ్వద్దంటూ సీరియస్‌గా ప్రయత్నాలు చేసిన సుబ్రమణ్యస్వామి ఓ రకంగా సక్సెస్‌ అయ్యారు. రెండో టర్మ్‌ చేయబోనంటూ రాజన్‌ ఇప్పటికే ప్రకటించారు. సుబ్రమణ్యస్వామి వత్తిడి వల్లే రాజన్‌ తప్పుకున్నట్లు అర్థమవుతోంది. రాజన్‌ను తప్పుకునేలా చేసిన సుబ్రమణ్యస్వామి

తాజాగా తన బాణాన్ని ఇప్పుడు కేజీవ్రాల్‌పై ఎక్కుపెట్టారు. కేజీక్రి వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ ఎంపీ మహేశ్‌ గిరీకి మద్దతుగా ఆమరణ దీక్షకు కూడా దిగారు. కేజ్రీ జీవితం అంతే ఫ్రాడే, ఐఐటీలో తాను మెరిట్‌ స్టూడెంట్‌ అంటూ కేజీ గొప్పలు చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన ఐఐటీలో ఎలా అడ్మిషన్‌ పొందాడో త్వరలో వెల్లడించనున్నట్లు సుబ్రమణ్యస్వామి ఓ వార్నింగ్‌ ఇచ్చారు.  తాను ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ వెంటపడ్డానని, ఆయన వెళ్లిపోయాడని ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ సంగతి తేలుస్తానని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. కేజీవ్రాల్‌ నివాసం బయట నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నేత మహేశ్‌ గిరి వద్దకు వెళ్లిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి విూడియాతో మాట్లాడారు. ‘కేజీవ్రాల్‌ జీవితం మొత్తం కూడా మోసంతో నిండినదే. తాను ఐఐటీలో మెరిట్‌ విద్యార్థినని కేజీవ్రాల్‌ చెప్తాడు. కానీ అసలు ఆయనకు అందులో ఎలా అడ్మిషన్‌ వచ్చిందో నేను త్వరలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి బహిరంగంగా చెబుతా. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయిని అంటూ స్వామి సంచలన వ్యాఖ్య చేశారు.