ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యాలయాన్ని సందర్శించినబి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్
ఢిల్లీ డిసెంబర్ 16 జనం సాక్షి:
ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం నాడు బి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్ సందర్శించారు. మధ్యాహ్నం..1.38 గం.లకు ఆఫీస్ కు చేరుకున్న కెసీఆర్ , తన ఛాంబర్ లో కూర్చొని ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రముఖుల తో కాసేపు చర్చించారు.
అనంతరం కార్యాలయ మొదటి రెండో అంతస్థుల్లో, ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హల్ ను, పలువురికి కేటాయించిన చాంబర్లను, కలియతిరిగి పరిశీలించారు.ఈ సందర్భంగా, పలు సూచనలు చేశారు.ఆనంతరం తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బి ఆర్ ఎస్ నేతలు,కార్యకర్తలు అభిమానులకు,అభివాదం చేస్తూ,పలకరిస్తూ ముందుకు సాగారు.ఈ.సందర్భంగా జై భారత్ జై కేసిఆర్ జై బి ఆర్ ఎస్ నినాదాలు పార్టీ పరిసర ప్రాంతాల్లో మారుమోగాయి.
ఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ నేతలు కె. కేశవరావు, నామ నాగేశ్వర్ రావు తో పాటు పలువురు ఎంపీ లు, తదితరులు పాల్గొన్నారు.