ఢీల్లీ కోర్టు ముందు చౌతాలా మద్దతుదారుల ఆందోళన

న్యూఢిల్లీ : ఉపాధ్యాయ అక్రమ నియామకాల కేసులో నేడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలాకు ఢీల్లీ కోర్టు శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు కోర్టు ముందు ఆందోళనకు దిగారు. దక్షిణ ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని కోర్టు వద్దకు ఈ ఉదయం భారీగా ఆయన మద్దతుదారులు చేరుకొని నిరసనకు దిగడంతో పోలీసులె బాష్పవాయువు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జి చేశారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో గత వారం చౌతాలాతోపాటు 53 మందికి కోర్టు దోషులుగా నిర్థారించిన విషయం తెలిసిందే.