తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక ప్రజలు
మెల్లగా ఇళ్లకు చేరుకుంటున్న జనం
అమలాపురం,జూలై22(జనం సాక్షి ): వరదఉధృతి తగ్గడంతో లంక గ్రామాల్లోని ప్రధాన రోడ్లు, ఎత్తయిన ప్రదేశంలో ఉన్న రోడ్లు వరద నీటి నుంచి బయటపడుతున్నాయి. పళ్లవారిపాలెం`గురజాపులంక రోడ్డు కూనాలంక వద్ద రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. లంకాఫ్‌ఠాణెళిల్లంక, గురజాపులంక, కూనాలంక, లంకాఫ్‌గేదెల్లంక, చింతపల్లిలంక, చింతావానిరేవు తదితర గ్రామాల్లోని లోత ట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తుంది. అక్కడక్కడ ఇళ్లు బయటపడడంతో బాధితులు ఇళ్లను, ఇంట్లోని సామగ్రిని శుభ్రం చేసుకుంటున్నారు. వరద బాధితులకుభోజనాలు అందించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు వరద తగ్గినప్పటికీ లంక గ్రామాల ప్రజలకు పడవ ప్రయాణాలు తప్పడంలేదు. అప్పనపల్లి కాజ్ వేపై ఇంకా వరదనీరు ప్రవహిస్తుండడంతో అప్పనపల్లి, పెదప ట్నం లంక, బి.దొడ్డవరం గ్రామాలకు చెందిన ప్రజలు
కాజ్‌వేపై పడవపై ప్రయా ణించి బి.దొడ్డవరం మలుపులో దిగి ఆయా గ్రామాలకు చేరుకుంటున్నారు. పెదపట్నం, అప్పనపల్లి ఉచ్చు లవారిపేటకు ట్రాక్టర్ల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయి. మరోవైపు
కొన్నిరోజులుగా ధవళేశ్వరం వద్ద నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్న గోదావరి నీటిమట్టం మరింత నెమ్మదించింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంవల్ల 3గంటలకు ఒక్క పాయుంట్ చొప్పున తగ్గుతోంది. గురువారం ఉదయం నీటిమట్టం 14.60 అడుగులుగా ఉండగా రాత్రి 11 గంటలకు 14 అడుగులకు నమోదైంది. 12 గంటల వ్యవధిలో కేవలం 4 పాయింట్లు తగ్గుముఖం పట్టగా 60వేల క్యూసెక్కుల ప్రవాహం తగ్గింది. 12,13,274 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డెల్టా కాలువకు నీటి విడుదలను పెంచి 7,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువన భద్రాచలంవద్ద తెల్లవారుజామున 3గంటల వరకు పెరిగిన నీటిమట్టం 48.70 అడుగులకు చేరుకుని ఆపై తగ్గుముఖం పట్టింది. ఆపై క్రమంగా తగ్గుముఖం పడుతూ సాయంత్రానికి 46 అడుగులకు చేరుకుంది. మరో 3 అడుగులు మేర నీటిమట్టం తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు. రాత్రి 10గంటలకు నీటిమట్టం 45.70అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.