తడబడుతున్న భారత్
ఆక్లాండ్ వన్డేలో 71 పరుగులకే మూడు వికెట్లు |
ఆక్లాండ్, మార్చి 14 : ఆక్లాండ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ తడబడుతోంది. 288 పరుగుల లక్ష ఛేదనలో టీంఇండియాకు ఆరంభంలోనే డబుల్ షాక్ తగిలింది. జింబాబ్వే బౌలర్ పన్యంగరా దెబ్బకు భారత ఓపెనర్లు ఇద్దరూ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేరారు. దీంతో 21 పరుగుల వద్దే టీంఇండియా రోహిత్, ధవన్ వికెట్లు కోల్పోయింది. తర్వాత కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాక రహానే ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.