తడిసిన ధాన్యం కొనుగోలుకు హావిూ
నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే
జనగామ,డిసెంబర్15(జనంసాక్షి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యపు
గింజను ప్రభుత్వరంగ సంస్థ ద్వారా, లేదంటే ట్రేడర్లు, మిల్లర్ల సాయంతో గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దని జనగామ మార్కెట్ కార్యదర్శి చందర్ అన్నారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆయన అనంతరం రైతులతో మాట్లాడి ఓదార్చారు. తడిసిన ధాన్యం బాయిల్డ్ రైస్ కస్టమ్ మిల్లింగ్ ద్వారా తమిళనాడుకు బియ్యం ఎగుమతి అవుతున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ధాన్యం కొనుగోలుకు చయర్యలు తసీఉకుంటామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా హావిూ ఇచ్చారు. రైతులు అధైర్య పడవద్దన్నారు. తనను కలసిన కొందరికి ఆయన భరోసా ఇచ్చారు.
ఓ మోస్తారు వర్షంతో మార్కెట్‌లో అమ్ముకుందామని ఆరబెట్టుకున్న అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. జనగామ వ్యవసాయ మార్కెట్‌కు తరలించిన దాదాపు 5వేల బస్తాలకు పైగా ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని పలు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సైతం అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దగా మారింది. కాగా, ప్రభుత్వరంగ సంస్థల కొనుగోలు కేంద్రాల ద్వారా తడిసిన ప్రతీ ధాన్యం గింజను కొంటామని ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో రైతులకు ఉపశమనం లభించింది. అయితే జనగామ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటి ప్రవాహంలో కొంతమేర కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యంను కుప్పగా పోసుకొని మళ్లీ ఆరబెట్టుకునేందుకు రైతన్న కష్టనష్టాలకు గురవుతున్నాడు. కాగా, అకాల వర్షంతో కేవలం ఒక్క మే నెలలోనే జనగామ వ్యవసాయ మార్కెట్‌లో మూడుసార్లు వేలాది బస్తాల ధాన్యం తడిసింది. అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసిందని రైతులు వాపోయారు. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. గ్రామాల్లో స్వల్పంగా నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాల కోసం వచ్చిన రైతుల ధాన్యం స్వల్పంగా తడిసింది. అధికారులు సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతు కోరుతున్నారు. వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హావిూ ఇచ్చారు.