తనను అవమానించినందుకు పరువు నష్టం

రెండు పత్రికలపై కేసు వేసిన లోకేశ్‌
విశాఖలో టిడిపినేత లోకేశ్‌ వెల్లడి
విశాఖపట్టణం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  తనను, తన కుటుంబాన్ని అవమానపర్చే విధంగా కథనాలను ప్రచురించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పరువు నష్టం దావా వేశారు. ఇంతకాలం సహించామని,కానీ ఇక సహించేది లేదన్నారు. ఎవరు అవమాన పర్చినా కోర్టుకు ఈడుస్తామని అన్నారు. సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి విశాఖకు నారా లోకేష్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ.. కేసు వచ్చే నెల 14 వాయిదా వేసారని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావోద్దని కోర్టు తెలిపింద న్నారు. తప్పుడు వార్తలు ఎవ్వరు రాసిన ఊరుకోనేది లేదని, ఇంకా ఎన్నాళ్ళు మాపై తప్పుడు వార్తలు రాస్తారని, జగన్‌ లాగా 16 నెలలు జైల్‌ కి వెళ్లి కోర్టుకి రాలేదని, న్యాయం కోసం వచ్చానన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ఓ ఫ్యాక్షనిస్టు వ్యాపారాలన్నీ తానే చేయాలని రాష్ట్రంలో ఉన్న మిగతా వారిని వేధిస్తూ భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు సినిమా ఇండస్టీ పై పడ్డారని, ఇండియాలో ఎక్కడా లేని షరతులు పెట్టారు. రాష్ట్రంలో సిని ఇండస్టీ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కొత్త రాజధాని విశాఖ అని ఏం పీకారని ఆయన ధ్వజమెత్తారు. సొంత బాబాయ్‌ను హత్యచేసినా కించిత్‌ చలనం లేదన్నారు. దీనినిబట్టి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.