తనపై రాజకీయ కుట్ర జరుగుతుంది
– రాజకీయ కుట్రతోనే లైంగిక ఆరోపణలు
– శాంకరి కళాశాలతో నాకు సంబంధం లేదు
– నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్
నిజామాబాద్, ఆగస్టు3(జనం సాక్షి) : తనపై రాజకీయంగా కుట్ర జరుగుతుందని, రాజకీయ కుట్రలతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని నిజామాబాద్ మాజీ మేయర్, డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ ఆరోపించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన స్పందించారు. శాంకరి కళాశాలతో తనకు ఏమాత్రం సంబంధంలేదని పేర్కొన్నారు. ఆ కళాశాలను ఎప్పుడో ఇతరులకు అప్పగించామని స్పష్టంచేశారు. విద్యార్థుల ధ్రువపత్రాలు సైతం ఆ యాజమాన్యం వద్దే ఉన్నాయన్నారు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు. రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తెలియదు కానీ మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు’ అని ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. ధర్మపురి సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్‌లో శాంకరి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, పీడీఎస్‌యూ ఇతర సంఘాల ప్రతినిధులు, తమ తల్లిదండ్రులతో 11 మంది విద్యార్థినులు సచివాలయంలో ¬ంమంత్రిని కలిశారు. సంజయ్‌కు చెందిన కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరంలో గత డిసెంబరులో చేరామని, హాస్టలులో ఉంటున్నామని విద్యార్థినులు పేర్కొన్నారు. ప్రవేశాల సమయంలో ఉన్న ప్రిన్సిపల్‌ను తొలగించిన కళాశాల ఛైర్మన్ సంజయ్.. తమను కళాశాల హాస్టలుకి రావాలని ఒత్తిడి తెచ్చారని, అసభ్య పదజాలంతో, దూషించి భయభ్రాంతులకు గురిచేశారని లిఖితపూర్వకంగా తెలిపారు. ఇద్దరు విద్యార్థినులను తన వసతిగృహానికి బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడులు చేయడానికి ప్రయత్నించారని, ఒక విద్యార్థిని గాయపడిందని వాపోయారు. అయినా ఆమెను ఇంటికి పంపించకుండా బెదిరించారన్నారు. గతనెల 26న మరో విద్యార్థిని బంధించారని వివరించారు. మొత్తం 13 మంది విద్యార్థినుల్లో 11 మందిపై ఇలాగే ప్రవర్తిస్తున్నారని వాపోయారు. సంజయ్‌పైనా, కళాశాల నిర్వాహకులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తాము విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని కోరారు. ఈఫిర్యాదుపై స్పందించిన ¬ంమంత్రి డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. దీనిపై నిజామాబాద్ పోలీసు కమిషనర్‌తో పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై స్పందించిన సంజయ్ ఈ మేరకు స్పందించారు.
లైంగిక ఆరోపణలు.. టీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారం – అరవింద్
టీఆర్‌ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మరో కుమారుడు బీజేపీనేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్ విూద వచ్చిన ఆరోపణలు టీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారమని అరవింద్ అన్నారు. సంజయ్‌పై వస్తున్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా డ్యామేజీ జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. తాము విడిపోయి 20 ఏళ్లు దాటిపోయిందని అరవింద్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు 10రోజులుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. శ్రీరాంసాగర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా
మారిపోయిందని అరవింద్ తెలిపారు. మంత్రి ఎక్కడ ఉన్నారో ఎందుకు నిజామాబాద్ వైపు రారో తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఎదురుచూస్తుంటే రైతు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఎంపీ కవిత ఐటీ హబ్ తెర విూదకు తెచ్చారన్నారు. టీఆర్‌ఎస్ వాళ్లు యువత చెవుల్లో ఐటీ హబ్ పేరుతో గులాబీ పువ్వులు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల విూద ప్రేమ ఉంటే తెలంగాణ యూనివర్సిటీని ఎందుకు అభివృద్ధి చేయాలని, ఎంతమంది విద్యార్థులను ఎంపీ కవిత అమెరికా పంపారని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు.