తపాలా జీడియస్ స్థానాలకు దరఖాస్తులు
ఖమ్మం, డిసెంబర్ 11 : జిల్లాలోని తపాలా శాఖలో ఖాళీగా ఉన్న ఐదు గ్రామీణ డాక్‌సేవక్ (జీడియస్) స్థానాలను భర్తీచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తపాలా శాఖ జిల్లా పర్యావేక్షకాధికారి ముక్తేశ్వరరావు మంగళవారం ఇక్కడ తెలిపారు. 18 నుండి 65 వయసు గల 8వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపాలిరు. గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేసిన సంబంధిత జిరాక్స్ కాపీలతో దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్టుద్వారా మాత్రమే పంపాలని ముక్తేశ్వరరావు అన్నారు.