తమిళనాడులో స్టెర్‌లైట్‌ యూనిట్‌ మూసివేత

చెన్నై : తమిళనాడులోని టుటికారన్‌లో ఉన్న స్టెర్‌లైట్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రాగి కర్మాగారాన్ని మూసివేయాలని తమిళనాడు కాలుష్యన నియంత్రణమండలి అదేశాలు జారీచేసింది. మార్చి 23న గ్యాస్‌ లీకవడంతో పరిసర గ్రామాల ప్రజలు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్లాంట్‌ను మూసివేయాలని పలు రాజకీయలపక్షాలు
ఆందోళన నిర్వహించాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణమండలిని అధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌ను మూసివేయాలని అదేశాలు జారీ చేసింది.