తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం

 జయలలిత నమ్మిన బంటు, ఆర్థిక మంత్రి ఓ.పన్నీరు సెల్వం తమిళనాడు 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన పన్నీరు సెల్వం అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. పది గంటలకే అక్కడకు చేరుకుpanneerselvamన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం పన్నీరు సెల్వం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అర్థరాత్రి దాటాక 1.25 గంటలకు ఆయనతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక నిమిషంలో ప్రమాణ స్వీకారం పూర్తయింది. గతంలో రెండుసార్లు జయలలిత స్థానంలో ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. జయలలిత మరణానంతరం అధికార పార్టీలో తలెత్తనున్న రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు సోమవారం ఉదయమే రాజీ సూత్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభా పక్ష నేతగా పన్నీర్‌సెల్వం నియమితులవుతారు.