తలసానిపై స్పీకర్‌దే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కేంద్ర ¬ం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అనంతరం విూడియాతో మాట్లాడారు.
రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ మంత్రిగా కొనసాగుతుండటంపైడనిపబజూ; విూడియా ప్రశ్నించగా..తలసాని శ్రీనివాస్ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభ స్పీకరే; అని సమాధానమిచ్చారు. రాజ్ నాథ్ తోపాటు కేంద్ర ¬ం శాఖ కార్యదర్శిని కూడా గవర్నర్ కలుసుకున్నారు.