తలుపులు మూసేకదా.. తెలంగాణ ఇచ్చింది

 

` మోదీ వ్యాఖ్యలను సమర్ధించిన రాజాసింగ్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుబట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌ లో తెలంగాణ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ తప్పుపట్టడం సిగ్గు చేటన్నారు.. ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? పార్లమెంట్‌ తలుపులు మూసి, మైకులు బంద్‌ చేసి కనీస చర్చల్లేకుండా తెలంగాణ బిల్లు పెట్టిన మాట వాస్తవం కాదా?అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు పెప్పర్‌ స్పే చల్లుతూ గొడవ చేసిన మాట నిజం కాదా?కాంగ్రెస్‌ విధానాలవల్లే కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయిన మాటల్లో నిజం లేదా?కాంగ్రెస్‌ను తిడితే కేసీఆర్‌ కు, టీఆర్‌ఎస్‌ నేతలకు వచ్చిన నొప్పేంది? కాంగ్రెస్‌ ? టీఆర్‌ఎస్‌ నాయకులు దొందూ దొందేనని దీంతో స్పష్టమైంది.ఒకవైపు మజ్లిస్‌ నేతలతో ఇంకోవైపు కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న టీఆర్‌ఎస్‌ నేతలకు సిగ్గు లేదన్నారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్న తరుణంలో ఆ చర్చను డైవర్ట్‌ చేసేందుకే నిరసనల పేరుతో టీఆర్‌ఎస్‌ డ్రామాలాడు తోంది. డబుల్‌ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు సహఆ నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఓర్వలేక నిరసనల పేరుతో నాటకాలాడుతున్నారు. రాజ్యాంగాన్ని తిడుతూ? ప్రజాప్రతినిధులను కలవకుండా ఫాంహౌజ్‌ కే పరిమితమైన కేసీఆర్‌ కు సీఎంగా కొనసాగే అర్హత లేదు. ఉద్యమ ద్రోహులను, భూకబ్జాదారులను, దోపిడీదొంగలతో టీఆర్‌ఎస్‌ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిపోయింది.దొంగల ముఠా నాయకుడు కేసీఆర్‌ కు ప్రధానమంత్రిని, బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిప్పులు చెరిగారు.

తాజావార్తలు