మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ విచారణ వాయిదా
మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో నవంబర్ 13కు ఇన్‌చార్జి జడ్జి వాయిదా వేశారు. ఈ కేసులో బుధవారం తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలను నమోదుచేయాల్సి ఉన్నది. ఇప్పటికే కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను రికార్డు చేసిన విషయం తెలిసిందే.